telugu film news

0 Comments

ప్రబాస్ కి బాహుబలి కష్టాలు


బాహుబలి ది బిగినింగ్ తో ఇండియావైడ్ గా ఫేమస్ అయ్యాడు ప్రభాస్. యాడ్ మార్కెట్ లో అయితే డార్లింగ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇంత పాపులారిటీ ప్రభాస్ కు ఈజీగా రాలేదు. గుర్రపు స్వారీలు, యుద్దవిద్యలు నేర్చుకున్నాడు. శివలింగాన్ని ఎత్తిన శివుడిగా కనిపించడానికి 130కేజీల వరకు వెయిట్ పెరిగాడు. హెవీ వర్కవుట్స్ చేసి మజిల్ బాడీతో హాలీవుడ్ హీరోలా కనిపించాడు

అయితే బాహుబలి-2కోసం ఇంతకంటే ఎక్కువ వెయిట్ గెయిన్ చేస్తున్నాడుబాహుబలి ది బిగినింగ్ లో 130కేజీల బరువుతో కండరగండుడిగా కనిపించిన ప్రభాస్, బాహుబలి ది కనుక్లూజన్ కోసం 150కేజీల బరువు పెరుగుతున్నాడట. శివుడుఅమరేంద్రబాహుబలి పాత్రల్లో వేరియేషన్ చూపించడానికి ఇంత వెయిట్ గెయిన్ చేస్తున్నాడట ప్రభాస్. దీనికోసం అమెరికా నుంచి స్పెషల్ కిట్స్ కూడా తెప్పించారట.

 ఇక బాహుబలి ది కనుక్లూజన్ కోసం ఇంతలా కష్టపడుతూనే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని ఫోకస్ చేస్తున్నాడు ప్రభాస్.బాహుబలి ది కనుక్లూజన్ కంప్లీట్ కాగానే యువిక్రియేషన్స్ లో సుజిత్ సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఇక సినిమా తో పాటు మరో సినిమాకు సైన్ చేశాడు ప్రభాస్. మైత్రీ మూవీ మేకర్స్ లో తనతో మిర్చి చేసిన కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి సైన్ చేశాడట.

ఇక రెండు సినిమాలు 2017లోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సుజిత్ అయితే డార్లింగ్ కోసం వెయిట్ చేస్తోంటే, కొరటాల ప్రజెంట్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో బిజీగా ఉన్నాడు. సినిమా తర్వాత మిర్చి కాంబినేషనే సెట్స్ కు వెళ్లబోతోంది.



You may also like

No comments: